YE DHAAREDHURAINA {THE LIFE OF RAM} [ఏ దారెదురైనా లైఫ్ ఆఫ రామ్] Song Lyrics
Image Credit Goes To YouTube
YE DHAAREDHURAINA {THE LIFE OF RAM} [ఏ దారెదురైనా లైఫ్ ఆఫ రామ్] Jaanu (2020) Telugu Song Lyrics In Telugu
Life of Ram Song Lyrics from Jaanu (2020)__ telugu movie starring Sharwanand _ sung by Pradeep Kumar lyrics by Sirivennela Seetarama Sastry at_music by Govind Vasantha & __music label by_Adithya Music _More info WIKI.
LIFE OF RAM - SONG DETAILS | |
MOVIE | Jaanu (2020) |
SINGERS | Pradeep Kumar |
LYRICIST | Sirivennela Seetarama Sastry |
MUSIC | Govind Vasantha |
STAR CAST | Sharwananadh |
MUSIC LABEL | Aditya Music |
YOUTUBE | Aditya Music / Shalimar Cinema |
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
LIFE OF RAM (లైఫ్ ఆఫ రామ్) Online Video Song Credit Goes To YouTube
Music Label : Adithya Music
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
Life Of Ram (Jaanu (2020) Song Lyrics In Telugu
చిత్రం : ఏ దారెదురైనా (లైఫ్ ఆఫ రామ్)
సంగీతం : గోవింద్ వసంత్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ప్రదీప్ కుమార్
YE DHAAREDHURAINA {THE LIFE OF RAM} [ఏ దారెదురైనా లైఫ్ ఆఫ రామ్] Song Lyrics
ఏ దారెదురైనా యెటు వెళుతుందో
అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ
పోతున్నా
ఏం చూస్తూ వున్నా నే వెతికానా యేదయినా
ఊరికనే చుట్టూ యేవేవో కనిపిస్తూ వున్నా
కదలని ఓ శిలనే ఐనా తృటిలో కరిగే కలనే ఐనా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై వుంటానంటున్నా
ఎదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు వున్నా
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు యెరగరు
నా వూపిరిని యిన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా యెద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి
ఉదయం కాగానే
తాజాగా పుడుతూ వుంటా
కాలం యిపుడే నను కనగా అనగనగా
అంటూనే వుంటా ఎపుడూ పూర్తవనే అవక తుది లేని కధ నేనుగా
గాలి వాటం లాగ ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులూ పొందని లేఖ ఎందుకు వేస్తోందో కేక మౌనంగా
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు యెరగరు
నా వూపిరిని యిన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా యెద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి
లోలో యేకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో వూరిస్తూ వుంది జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతే వున్నా అంటూ వూయలలూపింది జోలాలి
తానే నానే నానినే (4)
తానే నానే నానినే (5)
తానే నానే నానినే
LIFE OF RAM (లైఫ్ ఆఫ రామ్) Online Video Song Credit Goes To YouTube
Music Label : Adithya Music