NENERA ANMANU AYYEDHI నేనేరా అమ్మను అయ్యేది SONG LYRICS
Pic Credit Goes To
NENERA ANMANU AYYEDHI నేనేరా అమ్మను అయ్యేది SONG LYRICS IN TELUGU FONT
శ్రావణ భార్గవి పాడిన అమ్మ పాట జానపద గేయం..
TELUGU LYRICS
పల్లవి
నేనేరా అమ్మను అయ్యేది.. నేనేరా ఆలిని అయ్యేది..
నేనేరా నీ చిరునామను.. నేనే కదా నీ అస్థిత్వమును..
నేనే ప్రతిరూపం నీకు .. అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి
నువు పిండాన్ని చిదిమేస్తవు ఎందుకురా..
మరి నేను నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా..
ఆడతూతురై పుట్టడం మన్నించరాని నేరమా..
మగవాడిలో సగమై ఎదిగిన ఆ ఘనతను మరిచి ఎందుకురా కత్తుల దాడి చేస్తుండ్రు..
పుడితే గొంతును నులిమేస్తూ..
పసి ప్రాణం నిలువున తీస్తుండ్రు..
అలా ఆ చెత్త కుప్పలో ఊపిరాడక విలవిల మంటే కనికరించని లోకం లోకి ఎందుకు వచ్చాను...
ఆవేశంలో ఓనా చీకటి తప్పుకు కడుపుల పడ్డాను.. "నేనేరా"
చరణం : 1
తొమ్మిది నెలలు మోసిన తల్లి ఆడది అని మరచి..
మెట్టినింటికి కీడును చేసి ఆడబిడ్డకు జన్మనిస్తినని..
మగవాడిని కంటే గౌరవం.. అది ఆడపిల్లైతె అగౌరవం.. అని కసితో వీధిన విసిరేస్తే..
ఏ కుక్కో పాలను తాపిస్తే.. అనాథగ పెరిగిన నాకు నలుదిక్కుల్లో అవమానాలు ఎదురౌతే..
పాపం నేనెవరిని అడగాలి.."నేనేరా.."
చరణం : 2
నే అబలను కాదుర సబలను.. విహరిస్తిని కదరా గగనము..
పురాణాల్లో నా బలముకు శ్రీ కృష్ణుడు బతికిన చరితము..
కాకతీయ సామ్రాజ్యము ఏలిన రాణి రుద్రను..
ఆతెల్ల దొరలను తరిమిన ఆ ఝాన్సీ భాయిని నేను..
ఇలానా చరితను మరిచి ఆడపిల్లంటే భయమును తలచి..
మూర్ఖులు మీరై ఒక్క క్షణంలో ఆలోచన చేయరురా..
పసి గొంతులో వరి గింజనువేసి పాపము చేయకురా.."నేనేరా"
SHARE THIS LYRICS
LEAVE A COMMENT
Disclaimer :
Welcome To Telugu Movies Lyrics In Telugu Website.
We Will Provide All Latest And Oldest Evergreen Popular Tollywood Super Hit Songs Lyrics In Telugu Font. All Songs lyrics, images and videos are Property Of Their Respective Copyright Owners. Our Site displayed here for educational purpose only.
PLEASE SHARE AND COMMENT
