Pilla Raa ( పిల్లా రా ) Song Lyrics
Image Credit Goes To YouTube
Pilla Raa (పిల్లా రా) Song Lyrics in Telugu Font From RX 100 (2018) Telugu Movie
Pillaa Raa The song is sung by Anurag Kulkarni, Lyrics are Written by Chaitanya Prasad and the Music was composed by Chaitanya Bharadwaj From Movie Rx100 . Star Cast Karthikeya, Payal Rajput
Song : Pillaa Raa
Movie Name : Rx100
Music By : Chaitan Bharadwaj
Lyrics By : Chaitanya Prasad
Sung By :Anurag Kulkarni
Telugu Lyrics
చిత్రం : Rx100 (2018)
సంగీతం : చైతన్య భరద్వాజ
గీత రచన : చైతన్య ప్రసాద్
గానం : అనురాగ్ కులకర్ణి
మబ్బు లోన వాన విల్లులా మట్టి లోన నీటి జల్లులా
గుండె లోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే
జాలి లేని రాక్షసివే గుండెలోని నా కసివే
చేప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే సరసకు చెలీ చెలీ రా
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనపడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా వున్నాగా నువ్వే యద సడివే అన్నాగా
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనపడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా వున్నాగా నువ్వే యద సడివే
మబ్బులోన వాన విల్లులా మట్టి లోన నీటి జల్లులా
గుండె లోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
చిన్నాదానా
ఓసి అందాల మైనా
మాయగా మనసు జారి పడిపోయెనే తపనతో
నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీ లాగే కులికెనే నిన్ను చేరగా
ఎన్నాళ్లయినా అవి ఎన్నేళ్లు అయినా వందేళ్లు అయినా
వేచి వుంటాను నిన్ను చూడగ
గండాలైనా సుడి గుండాలు అయినా వుంటానిలా నేను నీకే తోడుగా
ఓ ప్రేమా మనం కలసి ఒకటిగా ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనపడవా
అయ్యో రామా ఓసి వయ్యారి భామ
నీవొక మరపు రాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండె లోతులో
ఏం చేస్తున్నా నేను యే చోట వున్నా చూస్తూనే వున్నా
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కధనే రాద్దామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనపడవా
Pilla Raa (పిల్లా రా) Online Video Song Credit Goes To Mango Music YouTube
Music Label: Mango Music