Maguva Maguva [మగువా మగువా] Song Lyrics
Image Credit Goes To YouTube
Maguva Maguva [మగువా మగువా] Song Lyrics In Telugu Font From Vakeel Saab 2021 Movie
Maguva Maguva _Song Lyrics from Vakeel Saab 2021__ telugu movie starring Pawan Kalyan, Shruthi Hassan _ sung by Sid Sriram lyrics by Ramajogayya Shasthri at_music by Thaman S S & __music label by_Aditya Music_
Song : Maguva Maguva
Movie Name : Vakeel Saab 2021
Sung By : Sid Sriram
Music By : Thaman S S
Lyrics By : Ramajogayya Shasthri
Telugu Lyrics
చిత్రం : వకీల్ సాబ్
సంగీతం : థమన్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
గానం : సిడ్ శ్రీరామ్
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత
స.. గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ గ.మ.ప.మ.గ గ.మ..ని..ప.మ..స
స.. గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ గ.మ.ప.మ.గ గ.మ..ని..ప.మ..స
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా
స.. గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ గ.మ.ప.మ.గ గ.మ..ని..ప.మ..స
స.. గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ గ.మ.ప.మ.గ గ.మ..ని..ప.మ..స
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
స.. గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ గ.మ.ప.మ.గ గ.మ..ని..ప.మ..స
స.. గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ.స గ.మ.ప.మ.గ గ.మ.ప.మ.గ గ.మ..ని..ప.మ..స
Maguva Maguva (మగువా మగువా) Online Video Song Credit Goes To Aditya Music YouTube
Music Label: Adithya Music