VINARA SOORAMMA KOOTHURU MOGADA [వినరా సూరమ్మ కూతురి మొగుడా] SONG LYRICS
Image Credit Goes To YouTube
VINARA SOORAMMA KOOTHURU MOGADA [వినరా సూరమ్మ కూతురి మొగుడా] SONG LYRICS IN TELUGU FONT FROM ILLU ILLALU (1972) MOVIE
VINARA SOORAMMA KOOTHURU MOGADA Song Lyrics penned by APPALACHARYA music composed by K.V.MAHADEVAN and sung by S.JANAKI,RAJA BABU , from the Telugu cinema ILLU ILLALU (1972) Starring RAJA BABU, RAMA PRABHA
RAMA PRABHA (ACTOR ) రమాప్రభ (జననం : మే 5, 1946) తెలుగు సినిమా నటి. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది.
TELUGU LYRICS
పాట : వినరా సూరమ్మ కూతురి మొగుడా
చిత్రం: ఇల్లు-ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచన : అప్పలాచార్య
గానం: ఎస్ జానకి, రాజు బాబు
నటీ నటులు : రాజా బాబు, రమా ప్రభ
పల్లవి:
వినరా సూరమ్మ కూతురి మొగుడా...
విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ
వినరా సూరమ్మ కూతురి మొగుడా...
విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ
చెప్పు మలీ
కారు మబ్బులూ కమ్మిన వేళా...
కాకులు గూటికి చేరే వేళ...కా..కా...
చందమామ తొంగి చూసేవేళా ...
సన్నజాజులు పూసే వేళ ..అహా...ఓహో...
ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..
ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే
లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో...
ఏం జలిగింది...
తలుపు కిర్రునా చప్పుడైనది...
గుండె ఝల్లునా కొట్టుకున్నది...
తలుపు కిర్రునా చప్పుడైనది...
గుండె ఝల్లునా కొట్టుకున్నది...
మెల్ల మెల్లగా కళ్ళు తెరచి
నే వచ్చినదెవరో చూశాను...
చరణం 1:
ఎవలాలూ...
నల్లనివాడు...గుంట కన్నుల వాడు ..
గుబురుమీసాల వాడు ...అయ్యబాబోయ్...
ఆరడుగుల పొడుగు వాడు ...
ముద్దులిమ్మని నన్ను అడిగినాడు ...
ఏయ్ వాన్ని నే నలికేస్తాను....
నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగముదాచుకొన్నా...
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ ...
అమ్మా...నాన్నా....
అమ్మా...నాన్నా...కాపాడమంటూ...అల్లాడిపోయాను..
అయినా కానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు...
అంతలో వచ్చింది... ఏమిటీ మూల్చా?
కాదు... మా అమ్మ... వచ్చి ఏమంది?
చరణం 2:
వెళ్ళవే నా తల్లి... వెళ్ళవే అమ్మా...
ముద్దులిస్తే... నీకు డబ్బులిస్తాడు...
మంచి బట్టలిస్తాడు... డబ్బులిస్తాడు...
మంచి బట్టలిస్తాడు....అని ముందుకి తోసింది
ఛీ అది తల్లా.. కాదు లాక్షసి..పిచాచి...దెయ్యం.... తరవాతేమయిందో చెప్పు ...
తప్పనిసరియై వెళ్ళేను ...సిగ్గుపడుతు నిలుచున్నాను
గదిలోకెత్తుకు పోయేడు కథలూ కబుర్లు చెప్పేడు...
తన దుప్పటిలో చోటిచ్చేడు...
చరణం 3:
ఛీ.. కులటా పాపాత్ములాలా...నువ్వు నాకొద్దు ఫో.. వాడిదగ్గిరికే పో...
అంతకోపం ఎందుకయ్యా ...అప్పుడు నావయసైదయ్య ...
ఏంటీ నీ ఆప్పుడు కైదేల్లా..ఆ...
అంత కోపం ఎందుకయ్యా... అప్పుడు నావయసైదయ్యా ...
ఆ వచ్చినదీ మా తాతయ్య...
తాతయ్య....తాతయ్య....
తాతయ్య....తకతయ్యా..
తాతయ్య....తకతయ్యా..
తాతయ్యా...నేనింకా ఎవలో అనుకున్నా.
VINARA SOORAMMA KOOTHURU MOGADA [వినరా సూరమ్మ కూతురి మొగుడా] Online Video Song Credit Goes To YouTube
Music Label : Mango Music
THANKS FOR VISIT US
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE