Gopikamma [ గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా ] Song Lyrics
Gopikamma [ గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా ] Song Lyrics In Telugu Font From Mukunda (2014) Movie
Gopikamma Song Lyrics penned by Sirivennela music composed by Mickey J Meyer and sung by Chitra from the Telugu cinema Mukunda (2014) Starring Varun Tej, More info WIKI.
| GOPIKAMMA - SONG DETAILS | |
| MOVIE | Mukunda (2014) |
| SINGERS | Chitra |
| LYRICIST | Sirivennela |
| MUSIC | Mickey J Meyer |
| STAR CAST | Varun Tej |
| MUSIC LABEL | Aditya Music |
| YOUTUBE | Aditya Music / Shalimar Cinema |
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
GOPIKAMMA SONG LYRICS IN TELUGU
పాట : గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
చిత్రం : ముకుంద (2014)
గీత రచన : సిరివెన్నెల
గాయనీ మణి : చిత్ర
సంగీత దర్శకులు : మీకీ జె మేయర్
నటీ నటులు : వరుణ్ తేజ్
GOPIKAMMA గోపికమ్మ SONG LYRICS IN TELUGU FONT
పల్లవి
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా...
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా...
విరిసిన పూ మాలగా వెన్నుని యదవాలగా ..
తలపుని లేపాలిగా బాలా...
పరదాలే తీయకా పరుపే దిగనీయకా..
పవలింపా ఇంతగా మేలా...
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా..
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా..
కలికి ఈ కునుకేలా తెల్లవారవచ్చేనమ్మా ..
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా...
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా...
చరణం : 1
నీ కలలన్ని కల్లలై రాతిరిలో కరగవనీ..
నువు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి..
నీ కోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చేనని ..
ఆ రూపాన్నీ చూపుతూ అల్లుకుపో సౌదామిని..
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ ..
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేతచిక్కి ..
పిల్లనగ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ అంటూ ..
ఈ చిరుగాలీ నిను మేలుకొలుపు సంబరాన..
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా...
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా...
చరణం : 2
ఏడే అల్లరి వనమాలినను వీడే మనసును దయమాలీ..
నందకుమారుడు మురళీ లోలుడు నా గోపాలుడు ఏడే...ఏడే....
లీలా కృష్ణ కొలమిలో కమలములా కన్నెమది ..
తనలో తృష్ణ తేనేలా విందిస్తానంటున్నదీ..
అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది..
అందరికన్నా ముందుగా తనవైపే రమ్మన్నదీ ..
విన్నావా చిన్నారి ఏమందో ప్రతిగోపికా ..
చూస్తూనే చేజారీ ఈ మంచివేళ మించనీక ..
త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏమారకా ..
వదిలావో వయ్యారీ బృందవిహారి దొరకడమ్మా..
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా...
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా...
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా...
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా...
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
READ BELOW SONGS LYRICS ALSO
LEAVE A COMMENT
Disclaimer :
Welcome To Telugu Movies Lyrics In Telugu Website.
We Will Provide All Latest And Oldest Evergreen Popular Tollywood Super Hit Songs Lyrics In Telugu Font. All Songs lyrics, images and videos are Property Of Their Respective Copyright Owners. Our Site displayed here for educational purpose only.
PLEASE SHARE AND COMMENT






