Devude Ichadu Veedhi Okati [ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ] Song Lyrics
Devude Ichadu Veedhi Okati [దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి] Song Lyrics In Telugu From Anthuleni Katha Movie
ఇదే జీవిత సత్యం, నిజమా?
ఎంత శ్రమ పడ్డ , ఎంత అనుభవించిన, ఎంత ప్రోగు చేసినా, మృతువు అనేది ఒకనాటికి అన్నిటినీ వదిలి రమ్మంటోంది. అది తెలిసి కూడా అల్ప బుద్ధితో, అన్యాయాలకు, అక్రమాలకు, పాల్పడి, సంపాదన పేరుతో దోచుకొని, దాచుకుంటే, భాగవంతుడనే వాడు తప్పక చూస్తుంటాడు, నీ కర్మ ఫలం అనుభవించక తప్పదు. అందుకే కష్టపడి కూడబెట్టుకున్నదంత, విడిచి పెట్టి, జీవుడు దుఃఖంతో, భాదతో, ఏడుస్తూ , దీనంగా, హీనంగా, ఒంటరిగా, వెళ్ళి పోవాల్సిందే. కాకపోతే మనం తీసుకెళ్లేది, ఈ జీవితం లో కోరి తెచ్చుకున్న, పాప పుణ్య కర్మల మూటలనే మాత్రమే, ఇది బాగా గుర్తు పెట్టుకోండి, ఇదే జీవిత సత్యం... అంతే Thats All. జీవితం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పాలంటే " మనం కోసం కాకుండా యెదుటివారి కోసం బ్రతకటం". By BLOG ADMIN CHANDRAMOHAN PUSHPA VENI MANDULA
Comment Please
Devude Ichadu Veedhi Okati [దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి] Song Credit To Shalimar Cinema (YouTube)
Music Label : Shalimar Cinema YouTube
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఏసుదాసు
పల్లవి:
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
చరణం 1:
నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
చరణం 2:
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ
కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
చరణం 3:
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
ALL SONGS, IMAGES, VIDEOS, MUSIC AND LYRICS ARE PROPERTY OF THEIR RESPECTIVE COPYRIGHT OWNERS. ALL SONGS LYRICS AND VIDEOS IN THIS SITE PROVIDED HERE FOR EDUCATIONAL & PROMOTIONAL PURPOSES ONLY.
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE