MADHURA BHAVALA
మధుర భావాల సుమమాల
చిత్రం: జై జవాన్ (1970)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
మధుర భావాల సుమమాల పాట సాహిత్యం తెలుగులో
https://youtu.be/M8fsz1DvXw4
పల్లవి:
మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ
పసిడి కలలేవో చివురించే ప్రణయ రాగాలు పలికించే
మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ
చరణం 1:
ఎదను అలరించు హారములో.. పొదిగితిరి ఎన్ని పెన్నిధులో
ఎదను అలరించు హారములో.. పొదిగితిరి ఎన్ని పెన్నిధులో
మరువరాని మమతలన్నీ.. మెరిసిపోవాలి కన్నులలో
మరువరాని మమతలన్నీ.. మెరిసిపోవాలి కన్నులలో
మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ
చరణం 2:
సిరుల తులతూగు చెలి ఉన్నా.. కరుణ చిలికేవు నాపైన
సిరుల తులతూగు చెలి ఉన్నా.. కరుణ చిలికేవు నాపైన
కలిమికన్నా చెలిమి మిన్న.. కలవు మణులెన్నో నీలో
కలిమికన్నా చెలిమి మిన్న.. కలవు మణులెన్నో నీలో
మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ
చరణం 3:
ఒకే పధమందు పయనించి.. ఒకే గమ్యమ్ము ఆశించి
ఒకే పధమందు పయనించి.. ఒకే గమ్యమ్ము ఆశించి
ఒకే మనసై ఒకే తనువై... ఉదయశిఖరము చేరితిమి
మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ
పసిడి కలలేవో చివురించే ప్రణయ రాగాలు పలికించే