JANAVULE MRUDHUPANIVILE [జాణవులె మృదుపాణివిలె] SONG LYRICS
JANAVULE MRUDHUPANIVILE [జాణవులె మృదుపాణివిలె] SONG LYRICS IN TELUGU SUNG BY S P BALU, JIKKI
JANAVULE MRUDHUPANIVILE [జాణవులె మృదుపాణివిలె] SONG CREDIT TO TELUGU ONE (YouTube)
https://youtu.be/JZ6EiyoCfsU
MUSIC LABEL : SAREGAMA INDIA LIMITED
పాట ::- జాణవులె మృదుపాణివిలె
సినిమా పేరు ::- ఆదిత్య 369 (1991)
స్వర కల్పన ::- ఇళయరాజా
రచన ::- వేటూరి
పాడిన వారు ::- ఎస్ పి బాలు, జిక్కి, ఎస్. పి. శైలజ
||పల్లవి||
ఆ... ఆ... ఆ.... ఆ.... ఆ...
నెరజాణవులె.. వరవీణవులె కిలికించితాలలో ఆ హ హ
జాణవులె మృదుపాణివిలె మధుసంతకాలలో...
కన్నులలో... సరసపు వెన్నెలలె..
సన్నలలో ...గుసగుస తెమ్మెరలె
మోవిగని మొగ్గగని.. మోజుపడిన వేళలో..
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...
||చరణం :: 1 ||
మోమటుదాచీ మురిపెము పెంచే లాహిరిలో...
ఆ హ హ ఓ హొ హొ హో
ఊగవుగానే మురళిని వూదే వైఖరిలో..
చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల
చెలి పై యెదలో తుంగ అలా పొంగే ..ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమిరా..
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...
కన్నులలొ సరసపు వెన్నెలలె..
సన్నలలొ గుసగుస తెమ్మెరలె...
మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో...
||చరణం ::2 ||
చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో...
ఆ హ హ ఓ హొ హొ హో
వెన్నెల తాపం ...వయసుకు ప్రాణం ఈ చలిలో...
చెలి నారతిలా ..హారతిలా నవ్వాలీవేళ..
తొలి సోయగమే.. ఓ సగము.. ఇవ్వాలీవేళ...
పరువానికి.. పగవానికి.. ఒక న్యాయమింక సాగునా...
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...
కన్నులలో సరసపు వెన్నెలలె..
సన్నలలో గుసగుస తెమ్మెరలె...
మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో...
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో.
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
ALL SONGS, IMAGES, VIDEOS, MUSIC AND LYRICS ARE PROPERTY OF THEIR RESPECTIVE COPYRIGHT OWNERS. ALL SONGS LYRICS AND VIDEOS IN THIS SITE PROVIDED HERE FOR EDUCATIONAL & PROMOTIONAL PURPOSES ONLY.
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE